English | Telugu
బాలయ్య బాబుకి ఈ వీక్ నెస్ ఏంటి బాబూ!
Updated : Aug 21, 2023
'అఖండ', 'వీరసింహారెడ్డి' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన 'భగవంత్ కేసరి' సినిమాలో నటిస్తున్నారు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో.. నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంటర్టైన్ చేయనున్నారట బాలయ్య.
ఇదిలా ఉంటే, 'భగవంత్ కేసరి'లో బాలయ్య బాబు పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో బాలయ్య పాత్రకి మతిమరపు అనే వీక్ నెస్ ఉంటుందట. ఆ వీక్ నెస్ నేపథ్యంలో వచ్చే యాక్షన్, కామెడీ సీన్స్ సినిమాకి ఎస్సెట్ గా నిలుస్తాయని టాక్. అలాగే, పాలిటిక్స్ నేపథ్యంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా ఆకట్టుకుంటుందని సమాచారం. మరి.. బాలయ్య క్యారెక్టరైజేషన్ 'భగవంత్ కేసరి'కి ఏ స్థాయిలో ప్లస్ అవుతుందో తెలియాలంటే అక్టోబర్ 19 వరకు వేచిచూడాల్సిందే.
'భగవంత్ కేసరి'లో బాలకృష్ణకి జంటగా కాజల్ నటిస్తుండగా శ్రీలీల ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందిస్తున్నారు. టీజర్ తో ఆకట్టుకున్న 'భగవంత్ కేసరి' ఇప్పటికే భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటూ వార్తల్లో నిలుస్తోంది.