English | Telugu
పవన్ వర్సెస్ ఎన్టీఆర్.. ముచ్చటగా మూడోసారి బాక్సాఫీస్ వార్!
Updated : Aug 12, 2023
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ వార్ కి సిద్ధమవుతున్నారా? అవునన్నదే ఫిల్మ్ నగర్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'ఓజీ' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ చివరి వారంలో విడుదల చేయబోతున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ మూవీని 2024 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ ప్రథమార్ధంలో రిలీజ్ చేయబోతున్నారట. అదే గనుక నిజమైతే.. ఏప్రిల్ 5న రానున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మూవీ 'దేవర'కి పోటీగా 'ఓజీ' బరిలోకి దిగబోతున్నట్లే.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో పవన్, ఎన్టీఆర్ రెండు పర్యాయాలు పోటీ పడ్డారు. అయితే, రెండు సందర్భాల్లోనూ కేవలం వారం గ్యాప్ లో వచ్చిన ఈ ఇద్దరికీ సాలిడ్ హిట్ అయితే దక్కలేదు. 2005 సంక్రాంతికి 'బాలు'గా పవన్ పలకరిస్తే, 'నా అల్లుడు'గా తారక్ జనం ముందు నిలిచాడు. ఇక 2006 క్రిస్మస్ సీజన్ లో 'రాఖీ'గా ఎన్టీఆర్ తెరపైకి వస్తే.. 'అన్నవరం'గా పవన్ వచ్చాడు. మరి.. ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగనున్న పవన్, తారక్ ఈ సారి ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.