రి-రిలీజ్ దిశగా 'వెంకీ'?
తెలుగునాట ప్రస్తుతం రి-రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం నాటి బ్లాక్ బస్టర్స్ తో పాటు కొద్ది సంవత్సరాల ముందు విడుదలైన యావరేజ్, ఫ్లాప్ సినిమాలు కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోతున్నాయి. ఘరానా మొగుడు, భైరవ ద్వీపం, తొలి ప్రేమ, నరసింహ నాయుడు, ఖుషి, చెన్నకేశవరెడ్డి, ఒక్కడు, సింహాద్రి, వర్షం, పోకిరి, దేశముదురు, జల్సా, బిల్లా, ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది.. ఇలా పలు చిత్రాలు రి-రిలీజ్ బాట పట్టాయి. వీటిలో కొన్ని సినిమాలు వసూళ్ళ వర్షం కురిపించాయి.