English | Telugu
కమల్ హాసన్ సినిమాలో దళపతి..!
Updated : Aug 12, 2023
ఇప్పుడు స్టార్ హీరోలు మల్టీస్టారర్ సినిమాల్లో నటించటానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. తమ పాత్ర బావుంటే చాలు. చిన్న నిడివి ఉన్న పాత్రైనా సరే! అందులో నటించటానికి ఓకే చెప్పేస్తున్నారు. ముఖ్యంగా తమిళ హీరోలు. విక్రమ్ సినిమాలో అయితే కమల్ హాసన్‌కు విలన్‌గా రోలెక్స్ పాత్రలో సూర్య చేసిన పాత్ర మరచిపోలేం. అలాగే రీసెంట్‌గా వచ్చిన జైలర్ సినిమాలోనూ అంతే. ఇప్పుడు అలాగే మరో మల్టీస్టారర్ లైన్‌లోకి రానుంది. కానీ అసలు విషయం ఏంటంటే ఇందులో పోస్టర్‌పై ఇద్దరు అగ్ర హీరోలు కనిపిస్తారు కానీ.. సినిమాలో కనిపిస్తారో లేదో ఇప్పుడే చెప్పలేం అంటున్నారు. ఆ ఇద్దరూ అగ్ర హీరోలు ఎవరో కాదు.. ఒకరేమో కమల్ హాసన్ మరొకరు ఇళయ దళపతి విజయ్.
వివరాల్లోకి వెళితే, ఇళయ దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం లియో. ఇది అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. అయితే దీనికి కొనసాగింపుగా లియో 2 సినిమా కూడా తెరకెక్కనుందని టాక్. ఆ సినిమాను కమల్ హాసన్ నిర్మించబోతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు అధికారిక ప్రకటన రూపంలో వెలువడుతుందని సినీ సర్కిల్స్ అంటున్నాయి. మరి లియో.. లోకేష్ యూనివర్స్‌లో భాగమైతే మాత్రం లియో 2లో కమల్ హాసన్ కనిపిస్తారనటంలో సందేహం లేదు. ఇద్దరూ స్టార్స్ తెరపై కనిపిస్తే మాత్రం అభిమానులకు పండగేనని చెప్పొచ్చు. కమల్ హాసన్ హీరోగా నటిస్తూనే సినిమాలను నిర్మిస్తున్నారు.