English | Telugu

కమల్, రజినీ బాటలో చిరు.. రీల్ లైఫ్ తాతగా మెగాస్టార్.. మరో పవర్ ఫుల్ రోల్ లోడింగ్?!

రియల్ లైఫ్ లో ఎప్పుడో తాత అయిపోయిన మెగాస్టార్ చిరంజీవి.. రీల్ లైఫ్ లో మాత్రం ఇంకా ఆ పాత్ర పోషించనేలేదు. అయితే, త్వరలో ఆ వేషంలో కనిపించనున్నారట. లోకనాయకుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజినీకాంత్ తరహాలో చిరు కూడా సిల్వర్ స్క్రీన్ పై  తాతగా ఎంటర్టైన్ చేయనున్నారట. 

ఆ వివరాల్లోకి వెళితే.. గత ఏడాది విడుదలై అఖండ విజయం సాధించిన 'విక్రమ్'లో ఏజెంట్ అరుణ్ కుమార్ విక్రమ్ గా ఆకట్టుకున్నారు కమల్ హాసన్. అందులో తాతగానూ రంజింపజేశారు. ఇక రీసెంట్ గా రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'జైలర్' విషయానికి వస్తే.. ఇందులో రిటైర్డ్ జైలర్ ముత్తుగా అలరిస్తున్నారు రజినీకాంత్. ఇందులోనూ తాతగా కనిపించి మెప్పించారు సూపర్ స్టార్. కట్ చేస్తే.. కమల్, రజినీ బాటలోనే చిరు కూడా రీల్ లైఫ్ తాతగా కనిపించబోతున్నారట. కోలీవుడ్ కెప్టెన్ ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో మెగాస్టార్ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పవర్ ఫుల్ ఆఫీసర్ రోల్ లో దర్శనమివ్వనున్నారట చిరు. అలాగే  'విక్రమ్', 'జైలర్' తరహాలో మనవడి సెంటిమెంట్ కూడా ఉంటుందని బజ్. మరి.. ఈ వార్తల్లో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.