English | Telugu
కాజల్ తో నాగ్ 'గలాట'.. సెంచరీకి ఒకటి తక్కువ!
Updated : Aug 19, 2023
గత ఏడాది 'బంగార్రాజు', 'బ్రహ్మాస్త్ర' (పార్ట్ 1), 'ది ఘోస్ట్' చిత్రాలతో సందడి చేసిన సీనియర్ స్టార్ నాగార్జున.. ఈ సంవత్సరం మాత్రం ఇప్పటివరకు ఒక్క సినిమాతో కూడా పలకరించనేలేదు. ఇంకా చెప్పాలంటే.. కొత్త సినిమా కబురుని కూడా పంచుకోలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. నాగార్జున కెరీర్ లో 99వ చిత్రంగా తెరకెక్కనున్న అతని నెక్స్ట్ వెంచర్.. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కనుందట. మలయాళ మూవీ 'పొరింజు మరియయ్ జోస్' ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాగ్ కి జంటగా కాజల్ అగర్వాల్ కనిపించనుందని సమాచారం. అలాగే ఈ చిత్రానికి 'గలాట' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. నాగార్జున బర్త్ డే సందర్భంగా ఆగస్టు 29న ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయని ఫిల్మ్ నగర్ టాక్. మరి.. గత కొంతకాలంగా సాలిడ్ హిట్ లేని నాగ్ కి.. 'గలాట' అయినా స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఫిల్మ్ గా నిలుస్తుందేమో చూడాలి.