English | Telugu

నిఖిల్ 'స్పై'లో రామ్ చరణ్ స్పెషల్ రోల్!

'కార్తికేయ 2' వంటి బ్లాక్ బస్టర్ తో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని జూన్ 29 న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ ఉంది, ప్రమోషన్స్ కి సమయం లేకపోవడంతో సినిమాని వాయిదా వేస్తే మంచిదనే ఆలోచనలో నిఖిల్ ఉండగా, ఎట్టిపరిస్థితుల్లోనూ జూన్ 29 నే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.