English | Telugu
'విరూపాక్ష' దర్శకుడితో కళ్యాణ్ రామ్ మూవీ!
Updated : Aug 27, 2023
జయాపజయాలతో సంబంధం లేకుండా విభిన్న చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం 'డెవిల్' అనే పీరియాడిక్ స్పై థ్రిల్లర్ లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'విరూపాక్ష'. ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ ఘన విజయాన్ని సాధించింది. కాగా ఇటీవల కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు మరో చిత్రాన్ని ప్రకటించాయి. మైథికల్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో ఎవరనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అయితే ఇందులో కళ్యాణ్ రామ్ నటించే అవకాశముందని, ఇప్పటికే కథా చర్చలు జరిగాయని, ఈ ప్రాజెక్ట్ కి కళ్యాణ్ రామ్ ఓకే చెప్పాడని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని వినికిడి.