English | Telugu

గబ్బర్ సింగ్ లో పవన్ తండ్రిగా హరికృష్ణ

"గబ్బర్ సింగ్" లో పవన్ తండ్రిగా హరికృష్ణ నటిస్తారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, "షాక్", "మిరపకాయ్" చిత్రాల ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో గణేష్ నిర్మిస్తున్న చిత్రం" గబ్బర్ సింగ్". బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన "దబాంగ్" సినిమానే తెలుగులో "గబ్బర్ సింగ్ ‍" పేరుతో పునర్నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ "గబ్బర్ సింగ్" సినిమాలో ముందుగా రెబెల్ స్టార్ కృష్ణం రాజు, సహజనటి జయసుధ హీరో పవన్ కళ్యాణ్ కి తల్లిదండ్రులుగా నటిస్తారని వినిపించింది.