English | Telugu
బొత్స సత్యన్నారాయణగా పవన్ కళ్యాణ్
Updated : Jun 28, 2011
బొత్స సత్యన్నారాయణగా పవన్ కళ్యాణ్ నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ పిసిసి ఛీఫ్ గా ఉన్న బొత్స సత్యన్నారాయణ జీవిత చరిత్రను సినిమాగా తీయాలని హాస్య నటుడు, నిర్మాత అయిన గణేష్ అనుకుంటున్నారట. బొత్స సత్యన్నారాయణగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తే బాగుంటుందని కూడా ఆయన భావిస్తున్నారట. గ్రామస్థాయి నుంచి బొత్స సత్యన్నారాయన చిన్న లీడర్ గా, ఆ తర్వాత యమ్.యల్.ఎ.గా, ఆ తర్వాత మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ పిసిసి ఛీఫ్ గా ఎలా ఎదిగారన్నది చూపెడుతూ సినిమా తియాలనే ప్రయత్నంలో నిర్మాత గణేష్ ఉన్నారని సమాచారం.
అందుకోసం 2012 వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ డేట్లను బ్లాక్ చేసే ప్రయత్నంలోగణేష్ ఉన్నాడట. గణేష్ తీసే సినిమాలకు బొత్స సత్యన్నారాయణ తెర వెనుక ఫైనాన్సియర్ అని సిని వర్గాలు అనుకుంటున్నాయి. మామూలు ఒక చిన్న హాస్యనటుడిగా ఉన్న గణేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే స్థాయికి ఎలా ఎదిగాదన్నది ఇప్పటికీ పెద్ద మిస్టరీ. రియల్ ఎస్టేట్ లో సంపాదించానని గణేష్ చెపుతున్నా అందులో నిజమెంతో అందరికీ తెలిసిందే.