English | Telugu
సల్మాన్ హీరోగా పూరీ జగన్నాథ్ చిత్రం
Updated : Jul 7, 2011
సల్మాన్ హీరోగా పూరీ జగన్నాథ్ చిత్రం చేయబోతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే తెలుగులో ప్రముఖ యువ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఇటీవలే ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హీరోగా "బుడ్డా" హోగా తేరా బాప్ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లో పూరీ తన తర్వాత చిత్రాన్ని సల్మాన్ ఖాన్ హీరోగా తీయాలనుకుంటున్నాడు. అందుకు సల్మాన్ ఖాన్ కూడా సుముఖంగానే ఉన్నట్టు తెలిసింది.
పూరీ జగన్నాథ్ తాను తెలుగులో మాస్ రాజా రవితేజ, ఆశిన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రథాన పాత్రల్లో నటించగా దర్శకత్వం వహించిన సూపర్ హిట్ మూవీ "అమ్మా, నాన్న, ఓ తమిళమ్మాయి" ని హిందీలో కొన్ని మార్పులు, చేర్పులతో సల్మాన్ హీరోగా తీయాలనుకుంటున్నాడట. ఆ సినిమా కన్ ఫర్మ్ అయితే మహేష్ బాబుతో చేయల్సిన "ది బిజినెస్ మ్యాన్" గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్ సినిమాని ఏంచేస్తాడో మరి.