English | Telugu

వరుణ్ తేజ్, జాహ్నవి కపూర్ లతో నాగబాబు సినిమా

వరుణ్ తేజ్, జాహ్నవి కపూర్ లతో ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు సినిమా తీయబోతున్నారని విశ్వసనీయవర్గాలద్వారా అందిన మాచారం. వివరాల్లోకి వెళితే నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్. అలాగే తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా బాలీవుడ్ ని సైతం ఒక ఊపు ఊపిన ఒకనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి. అలాంటి శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాహ్నవి కపూర్. జాహ్నవి కపూర్ ని హీరోయిన్ గా సిని అరంగేట్రం చేయించాలని శ్రీదేవి, బోనీ కపూర్ లు అనుకుంటున్నారట.

ఇటీవల జరిగిన సిసియల్ అదేనండీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలకు తన తల్లిదండ్రులతో పాటు వచ్చిన జాహ్నవిని చూచిన నిర్మాత, నటుడు నాగబాబు ఆమెలో ఒక స్టార్ హీరోయిన్ కు కావలసిన అన్నిలక్షణాలూ ఉన్నాయని గమనించి, ఆమెను తనకొడుకు వరుణ్ తేజ్ ను తొలిసారి హీరోగా పరిచయం చేయబోయే సినిమా ద్వారా జాహ్నవిని కూడా తొలిసారి హీరోయిన్ గా పరిచయం చేయాలని ఆలోచిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. ఇదెంత వరకూ మెటీరియలైజ్ అవుతుందో వేచి చూడాలి.