English | Telugu

నాగార్జునకు కొడుకు నుంచి పోటీ

నాగార్జునకు కొడుకు నుంచి పోటీ ఏర్పడబోతోంది. వివరాల్లోకి వెళితే అన్నపూర్ణ స్టుడియో పతాకంపై, యువసామ్రాట్, కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, స్నేహ హీరోయిన్ గా, వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో, రజాకార్లకు వ్యతిరేకంగా సాయుధ తెలంగాణా రైతాంగపోరాట యోధుడి కథతో నాగార్జునే స్వయంగా నిర్మిస్తున్న "రాజన్న". నాగార్జున హీరోగా నటిస్తున్న "రాజన్న" సినిమా జూలై చివర్లో కానీ లేదా ఆగస్టు నెల మొదట్లో కానీ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

అలాగే కామాక్షీ కళా మూవీస్ పతాకంపై, నాగార్జున కుమారుడు యువ హీరో నాగచైతన్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అజయ్ భూయాన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, డి.శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న "దడ' సినిమా కూడా దాదాపుగా ఆగస్టు నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుశా నాగార్జున "రాజన్న", నాగచైతన్య "దడ" రెండు సినిమాలూ ఒకే నెలలో విడుదలయ్యే అవకాశాలుండటంతో ఈ తండ్రీ కొడుకుల మధ్య పోటీ అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడబోతుందేమోనని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.