English | Telugu

బాలనటుడిగా మహేష్ బాబు కొడుకు గౌతమ్

బాలనటుడిగా మహేష్ బాబు కొడుకు గౌతమ్ రాబోతున్నాదని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే నేడు ప్రిన్స్ గా వెలుగుతున్న ప్రముఖ టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఒకప్పుడు బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేసినవాడే. అప్పుడు మహేష్ బాబు ఇంతపెద్ద హీరో అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి మహేష్ బాబు కొడుకు గౌతమ్. గౌతమ్ వయసు ప్రస్తుతం నాలుగైదేళ్ళు ఉండవచ్చు. అలాంటి గౌతమ్ ని బాలనటుడిగా తమ సినిమాల్లో నటింపజేయాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. కాని అందుకు మహేష్ బాబు అంగీకరించలేదు...సరికదా "వాడింకా చిన్నపిల్లాడు.వాడు బాలనటుడిగా రావటానికింకా చాలా టైముంది" అంటూ దాటవేశాడు.

కానీ ఒక పెద్ద డైరెక్టర్ తాను తీయబోయే భారీ బడ్జెట్ సినిమాలో గౌతమ్ ని బాలనటుడిగా నటింపజేయాలని విశ్వప్రయత్నాలు చేసి, మొత్తానికి మహేష్ బాబు అంగీకారం సంపాదించాడట. అయితే అందుకు మహేష్ బాబు కొన్ని కండిషన్లు పెట్టినట్టు సమాచారం. అందులో ఒకటి గౌతమ్ ఆ సినిమాలో ఒకసారి మాత్రమే కనపడాలని. అన్నీ సవ్యంగా జరిగితే గౌతమ్ త్వరలో బాలనటుడిగా వెండి తెర మీద కనపడతాడు.