English | Telugu
హీరోగా అల్లు శిరీష్
Updated : Jul 5, 2011
హీరోగా అల్లు శిరీష్ రాబోతున్నాడని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఇప్పటికే మెస్టార్, పద్మభూషణ్, డాక్టర్ చిరంజీవి తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తెలుగు సినీ పరిశ్రమలో రాజ్యం ఏలుతున్నారు. ఆ దిశలో అడుగులు వేస్తూ మేగా నిర్మాత అల్లు అరవింద్ గారి మూడవ కుమారుడు, యువ హీరో అల్లు అర్జున్ కి తమ్ముడు అయిన అల్లు శిరీష్ కూడా హీరోగా సినీ రంగానికి రాబోతున్నాడు.
అయితే మెగా ఫ్యామిలీ హీరోలంతా తమ తొలి చిత్రాన్ని తెలుగులోనే చేశారు. కానీ అల్లు శిరీష్ మాత్రం హీరోగా మళయాళీ సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేయబోతున్నారని సమాచారం. మళయాళ సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ కి చాలా మంది అంటే లక్షల్లో అభిమానులున్నారు. అక్కడ అల్లు అర్జున్ పెద్ద హీరో. బహుశా అందుకనేమో అల్లు శిరీష్ అన్నకు అభిమానులున్న మళయాళీ సినీ పరిశ్రమ ద్వారా హీరోగా ఎంట్రీ ఇద్దామనుకుంటున్నాడు. ఎనీవే ఆల్ ది బెస్ట్ టు అల్లు శిరీష్ యాజె హీరో.