English | Telugu

కొంగుచాటు కృష్ణుడైన అల్లు అర్జున్

కొంగుచాటు కృష్ణుడైన అల్లు అర్జున్ అని ఫిలిం నగర్ లో జనం అంటున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ యువహీరో అల్లు అర్జున్ పెళ్ళికి ముందు రాత్రి పార్టీలంటే ఎగిరిగంతేసేవాడట. ఏ పబ్‍ లో చూసినా, ఏ పార్టీలో చూసినా అల్లు అర్జున్ కనపడేవాడట. ముఖ్యంగా లేట్ నైట్ పార్టీల్లో. అలాంటిది పెళ్ళయ్యాక ఫ్యామిలీ పార్టీల్లో తప్ప బయట లేట్ నైట్ పార్టీల్లో అల్లు అర్జున్ కనపడటం మానేశాడు. ఇదేంటయ్యా అల్లు అర్జున్ అని మీడియా అడిగితే "నౌ ఐ యామె ఫ్యామిలీ మ్యాన్" అని సమాధానమిస్తున్నాడు. కరెక్టే పెళ్ళయ్యాక మారాలి కానీ మరీ ఇలా కొంగుచాటు కృష్ణుడిలా మారితే ఎలా అంటున్నారు అతని ఫ్రెండ్స్.

అంతే కాదట. "బద్రీనాథ్" సినిమా కోసం తన జుట్టు బాగా పెంచాడు అల్లు అర్జున్. కానీ అతని భార్య స్నేహా రెడ్డికి అది ఇష్టం లేకపోవటంతో జుట్టు పొట్టిగా కట్ చేయించాడు. కాని మళ్ళీ సినిమా కోసం నానా బాధలూ పడి హెయిర్ ఎటాచ్ మెంట్ చేయించుకున్నాదు. అంతే కాదు పెళ్ళయ్యాక సినిమాల్లో హీరోయిన్లను లిప్ టు లిప్ ముద్దు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందట అల్లు అర్జున్ కి. కారణం భార్య స్నేహా రెడ్డి కళ్ళ ముందు కనపడుతుందట. ఇంతగా భార్య మాట వింటున్నా పెళ్ళయ్యాక విడుదలైన తొలి చిత్రం "బద్రీనాథ్" బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫ్లాపయ్యింది.