English | Telugu
చిరు న్యూస్ ఛానల్ పవర్ న్యూస్
Updated : Jun 26, 2011
చిరు న్యూస్ ఛానల్ "పవర్ న్యూస్" అని విశ్వసనీయవర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వేళితే ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉన్నముఖ్యమైన వారందరికీ వారినీ, వారి పార్టీనీ సపోర్ట్ చేసే న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. ఉదాహరణకు టిడిపిని సపోర్ట్ చేసేందుకు ఇటివి, స్టుడియో యన్, జగన్ ని సపోర్ట్ చేసేందుకు సాక్షి టి.వి., సాక్షి డైలీ న్యుస్ పేపర్, కె.సి.ఆర్.ని సపోర్ట్ చేసేందుకు తెలంగాణా న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ డైలీ న్యూస్ పేపర్ ఇలా ఉన్నాయి.
కనుక తనకు రాజకీయాల్లో మద్దతుగా ఉండటం కోసం మెగాస్టార్ చిరంజీవి ఒక శాటిలైట్ న్యూస్ ఛానల్ పెట్టబోతున్నారని ఇప్పటి వరకూ వినపడుతూ వస్తోంది. కాకపోతే ఇప్పుడు చిరు తన శాటిలైట్ న్యూస్ ఛానల్ పేరు "పవర్ న్యూస్" గా పేరు పెడుతున్నారని సమాచారం. ఈ "పవర్ న్యూస్" ఛానల్ కు స్వప్నను ఇప్పటికే తీసుకున్నారట. అలాగే ముఖ్యమైన విలేఖరులందర్నీ ఈ న్యూస్ ఛానల్ కోసం తిసుకుంటున్నారని వినికిడి. ఈ "పవర్ న్యూస్" ఛానల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లలో యువ హీరో, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కూడా ఒకరుగా ఉంటారట.