English | Telugu
సి కళ్యాణ్, సింగనమలతో పాటు ఇంకెవరున్నారు
Updated : Jul 8, 2011
సి కళ్యాణ్, సింగనమలతో పాటు ఇంకెవరున్నారు...? అన్న ప్రశ్న తలెత్తుతుంది. సి.కళ్యాణ్, సింగనమల రమేష్ లిద్దరూ కూడా సూరిని హత్యచేసిన అతని ముఖ్య అనుచరుడు భానుకిరణ్ సంపాదించిన ఆస్తులన్నింటికీ బినామీ పేర్లతో హక్కుదార్లుగా ఉన్నారనే విషయంలో పోలీసులు ఒక నిర్థారణకు వచ్చారు. అలాగే సి.కళ్యాణ్, సింగనమల రమేష్ లతో పాటు ఈ కేసులో ఇంకెవరెవరు ఇన్ వాల్వ్ అయి ఉన్నారనేదాని మీద వీళ్ళిద్దరి నుండి కొంత సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.
ఒక టాప్ దర్శకుడికి భానుకిరణ్ ఆస్తులను తాకట్టు పెట్టి సి.కళ్యాణ్ 7 కోట్లు తీసుకున్నట్లు వస్తున్న వార్త ఒకటి కాగా, మరో పెద్ద పేరున్న దర్శకుడి వద్ద నుండి, అతని భూవివాదాన్ని పరిష్కరించటానికి వీళ్ళిద్దరు తీసుకున్న మొత్తం 25 లక్షలని మరొక వార్త వినవస్తున్నది. మరి ఈ పేరున్న టాప్ డైరెక్టర్లిద్దరూ ఎవరనేది పేర్లు తెలియలేదు. కాస్త ఓపికపెడితే మన సినీ పరిశ్రమలో ఇంకెందరికి కనెక్షన్లున్నాయనేది బహుశా మనం ఆశ్చర్యపడే రేంజ్ లో తెలుస్తుంది.