English | Telugu

రాజమౌళి ఈగలో కాజల్ ఐటం సాంగ్

రాజమౌళి "ఈగ "లో కాజల్ ఐటం సాంగ్ లో నటించనుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే అపజయమెరుగని డైనమిక్ యువదర్శకుడు యస్.యస్.రాజమౌళి దర్శకత్వంలో, నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నిర్మిస్తున్న సినిమా "ఈగ". రాజమౌళి "ఈగ " సినిమాని ప్రయోగాత్మకంగా తీస్తున్నాడు. ఈ సినిమాలోని గ్రాఫిక్స్ వర్క్స్ కే అయిదు కోట్లు ఖర్చవుతున్నాయి. ముందు రాజమౌళి "ఈగ" ప్రయోగాత్మకంగా మొదలై ప్రస్తుతం కమర్షియల్ హంగులు కూడా అద్దుకుంటూంది.

ఎలాగంటారా...? గతంలో రాజమౌళి దర్శకత్వంలో, రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, అల్లు అరవింద్ నిర్మించిన ఆల్ టైమ్ హిట్‍ చిత్రం"మగధీర". ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన కాజల్ అగర్వాల్ "ఈగ" సినిమాలో ఒక ఐటం సాంగ్ లో నటించనుందని తెలిసింది. కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్ ఒక ఐటం సాంగ్ లో నటిస్తుందంటేనే ఈ "రాజమౌళి "ఈగ "సినిమాకి కమర్షియల్ హంగులొచ్చినట్లు. కాదంటారా...?