English | Telugu

మరోసారి పూరీ, రవితేజ కాంబినేషన్ లో మూవీ

మరోసారి పూరీ, రవితేజ కాంబినేషన్ లో మూవీ రానుందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, గతంలో ఇడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మనాన్నఓ తమిళమ్మాయి వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం మరొ చక్కని కథని రవితేజకు పూరీ జగన్నాథ్ ఇటీవల చెప్పారట, అదివినగానే రవితేజ ఒ.కె.అన్నారట.

ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ హీరోగా, పూరీ జగన్నాథ్ "బుడ్డా" అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దీని తర్వాత మహేష్ బాబు హీరోగా నటించే "ది బిజినెస్ మేన్" సినిమాకి దర్శకత్వం వహిస్తారు పూరీ జగన్నాథ్. రవితేజ హీరోగా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని సినిమా ప్రారంభం కావాలంటే ఈ రెండు సినిమాలూ పూర్తికావాలి. అలాగే రవితేజ ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో, దీక్షా సేథ్ హీరోయిన్ గా నటిస్తుండగా, వైవియస్ చౌదరి నిర్మిస్తున్న "నిప్పు" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ కమిట్ మెంట్లన్నీ పూర్తయిన తర్వాత పూరీ, రవితేజ కాంబినేషన్ లో మూవీ రానుందని తెలిసింది.