సంక్రాంతి బరి నుంచి 'ఫ్యామిలీ స్టార్' ఔట్!
2024 సంక్రాంతి సీజన్ పై పలు సినిమాలు కర్చీఫ్ వేశాయి. సంక్రాంతి పోరుకి సిద్ధమంటూ ఇప్పటికే 'గుంటూరు కారం', 'హనుమాన్', 'ఈగల్', 'ఫ్యామిలీ స్టార్', 'సైంధవ్', 'నా సామి రంగ' ఇలా పలు మూవీ టీమ్స్ ప్రకటించాయి. అయితే వీటిలో చివరికి నిలిచే సినిమాలు ఎన్నో అనే అనుమానం అందరిలో ఉంది. సంక్రాంతి బరి నుంచి ఆ సినిమా ఔట్, ఈ సినిమా ఔట్ అని ఇప్పటికే పలు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ పోరు నుంచి 'ఫ్యామిలీ స్టార్' తప్పుకుంది అంటూ కొత్త న్యూస్ వినిపిస్తోంది.