English | Telugu
Prabhas : 'దసరా' దర్శకుడితో ప్రభాస్.. ఇది కదా కాంబినేషన్ అంటే!
Updated : Nov 8, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. సలార్ పార్ట్-1 డిసెంబర్ 22న విడుదల కానుంది. 'కల్కి 2898 AD' తో పాటు మారుతీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా షూటింగ్ దశలో ఉన్నాయి. 'సలార్-2', 'స్పిరిట్' లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు 'సీతా రామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు న్యూస్ వినిపించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయబోయే దర్శకుల లిస్టులో మరో పేరు కూడా వినిపిస్తోంది. ఆ దర్శకుడు ఎవరో కాదు శ్రీకాంత్ ఓదెల.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'దసరా'తో శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ ఏడాది మార్చిలో విడుదలైన దసరా మూవీ వంద కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మొదటి సినిమాతోనే శ్రీకాంత్ దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్నాడు. స్టార్ హీరోలను, కమర్షియల్ సినిమాలను డీల్ చేయగలడనే నమ్మకాన్ని సంపాదించుకోగలిగాడు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ తన రెండో సినిమాకే ఏకంగా ప్రభాస్ ని డైరెక్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొని శ్రీకాంత్ ఓ అదిరిపోయే కథని సిద్ధం చేశాడట. ఇది ప్రభాస్ ఇమేజ్ కి, పాన్ ఇండియాకి సూట్ అయ్యే రస్టిక్ యాక్షన్ స్టోరీ అని సమాచారం. ఇప్పటికే ప్రభాస్ కి స్టోరీ లైన్ నచ్చిందని, ప్రస్తుతం శ్రీకాంత్ దానిని డెవలప్ చేసే పనిలో ఉన్నాడని టాక్. ఫైనల్ స్క్రిప్ట్ ప్రభాస్ కి నచ్చితే.. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మొదలయ్యే అవకాశముందని అంటున్నారు.