English | Telugu

పవన్ కళ్యాణ్ స్థానంలో గోపీచంద్ నిజమేనా?

క్రిష్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ హరి హర వీర మల్లు. పవన్ సినీ కెరీర్ లో నే మొట్టమొదటి చారిత్రక నేపథ్యం గా వస్తున్న ఈ మూవీ రెండు  సంవత్సరాల క్రితం అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఎప్పటికప్పుడు షూటింగ్ వాయిదా పడుతూ వస్తున్న  వీరమల్లు సినిమా  విషయంలో క్రిష్ తీసుకున్న నిర్ణయం ఇదే నంటూ ఒక రూమర్  బయటకొచ్చింది.

పవన్ కళ్యాణ్ హీరో గా క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు  అనే చారిత్రక నేపధ్యం ఉన్న సినిమా ప్రారంభం అయిన విషయం అందరికి తెలిసిందే. సగభాగం పూర్తయ్యిన ఈ సినిమా పవన్ కాల్షీట్ల సమస్యవల్ల వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా వచ్చే వేసవి వరకు పవన్ హరి హర వీరమల్లుకి డేట్స్ ఇవ్వలేనని  క్రిష్ కి చెప్పాడని దాంతో క్రిష్ గోపీచంద్ హీరోగా ఒక సినిమాకి డైరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ఒక రూమర్  ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతుంది.

గమ్యం అనే సినిమాతో తన సినిమా కెరీర్ కి బాటలు వేసుకున్న దర్శకుడు జాగర్లమూడి రాధాకృష్ణ మూర్తి అలియాస్ క్రిష్.. తొలి చిత్రంతోనే మంచి దర్శకుడుగా పేరు సంపాదించుకున్న క్రిష్ ఆ  తర్వాత వేదం,కంచె, కృష్ణంవందేజగద్గురుం, గౌతమీపుత్రశాతకర్ణీ ఎన్టీఆర్ కధానాయకుడు మహానాయకుడు,కొండపొలం లాంటి విభిమన్నమైన సినిమాలకి దర్శకత్వం వహించి మంచి  క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించాడు. హిందీ ,తమిళ  చిత్రాలకి కూడా దర్శకత్వం వహించిన క్రిష్  హరి హర వీరమల్లు కోసం ఎప్పటిలాగానే ఆగుతాడో  లేక గోపీచంద్ తో సినిమా చేసి బయట వినపడుతున్న రూమర్స్ ని నిజం చేస్తాడో చూడాలి.