English | Telugu
సెకండ్ ఇన్నింగ్స్‌కి రెడీ అవుతున్న రంభ!
Updated : Nov 1, 2023
రంభ.. తన అందచందాలతో అందర్నీ అలరించిన హీరోయిన్. రాజేంద్రప్రసాద్ హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా తక్కువ టైమ్‌లోనే అందరు టాప్ హీరోలతో నటించి టాప్ హీరోయిన్ లిస్ట్‌లో చేరిపోయింది. తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం 2008లో వచ్చిన ‘దొంగ సచ్చినోళ్ళు’. ఈ సినిమా తర్వాత పెళ్లి చేసుకొని మలేషియాలో సెటిల్ అయిపోయింది. అయితే 2009 నుంచి 2017 వరకు పలు టీవీ షోల్లో సందడి చేసింది.
సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పడం, కొన్నాళ్ళు సంసార జీవితాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉంటాం. అదే కోవలో ఇప్పుడు రంభ కూడా రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యాలనుకుంటోందట. ఒక ప్రముఖ హీరో సినిమాలో నటించేందుకు రంభ ఓకే చెప్పిందని సమాచారం. ఇకపై కంటిన్యూగా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని కొందరు దర్శకనిర్మాతలకు ఆమె మెసేజ్ ద్వారా తెలియజేసింది అంటున్నారు. ఇప్పుడున్న యంగ్ హీరోలకు అక్కగా, అత్తగా రంభ పర్‌ఫెక్ట్‌గా సూట్ అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. 47 ఏళ్ళ రంభ తన కెరీర్‌లో తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ, బెంగాలి, భోజ్‌పురి, ఇంగ్లీష్ భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించింది. ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా భాషతో నిమిత్తం లేకుండా సినిమాలు చేయాలని భావిస్తోందట.