English | Telugu
దేవరలో ఎన్టీఆర్ కి అక్కగా మంచు లక్ష్మి!
Updated : Oct 30, 2023
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. తనకు గ్లోబల్ ఇమేజ్ తెచ్చిపెట్టిన 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో 'దేవర'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. వీరితో పాటు ఇతర భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
'దేవర'లో తారక్ కి అక్క పాత్రలో మంచు లక్ష్మి కనిపించనుందని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కి ఆమె అక్కగా కనిపిస్తే, తెరకు కొత్తదనం వస్తుంది అనడంలో సందేహం లేదు. నిజానికి మంచు లక్ష్మి మంచి నటి అని, కానీ ఆమె ప్రతిభకు తగ్గ పాత్రలు రావడం లేదనేది ఇండస్ట్రీ వార్గాల్లో ఉన్న మాట. అయితే ఇప్పుడు దేవరలో ఆమెకి మంచి పాత్ర లభించిందని అంటున్నారు. ఈ మూవీలో అక్క పాత్ర ఎంతో కీలకమట. ఆ పాత్రని కొరటాల అద్భుతంగా మలిచారట. అలాంటి పాత్రలో నటించే అవకాశం రావడం లక్ష్మికి బిగ్ టర్న్ అని చెప్పొచ్చు.
మంచి ఫ్యామిలీతో ఎన్టీఆర్ కి మంచి అనుబంధం ఉంది. గతంలో 'యమదొంగ'లో మోహన్ బాబుతో కలిసి తారక్ నటించాడు. ఆ చిత్రంలో యముడిగా మోహన్ బాబు, యంగ్ యమగా ఎన్టీఆర్ పోటాపోటీగా నటించి అలరించారు. ఇప్పుడు తారక్, లక్ష్మి కాంబినేషన్ కూడా ఆ స్థాయిలో అలరిస్తుందేమో చూడాలి.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న దేవర చిత్రం రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.