English | Telugu
‘సలార్’ గురించి పుట్టుకొచ్చిన కొత్త రూమర్.. నిజమెంత?
Updated : Nov 1, 2023
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, రిలీజ్... ఒక సినిమాకి సంబంధించి ఈ మూడు అంశాలు ప్రధానం. వీటిలో ఏది లేట్ అయినా అది సినిమా ఫలితం మీద ప్రభావం చూపిస్తుంది. షూటింగ్ లేట్ అవ్వడం వల్ల ఆర్టిస్టులు ఇచ్చిన డేట్స్ కిల్ అయిపోయే ప్రమాదం ఉంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవ్వడం వల్ల ముందుగా అనుకున్న రిలీజ్ డేట్‌కి సినిమాను విడుదల చేయడం నిర్మాతకు సాధ్యం కాదు. వీటన్నింటి మధ్య ఒక భారీ సినిమాను రిలీజ్ చెయ్యాలంటే ఎంత కష్టంతో కూడుకున్న పనో దర్శకనిర్మాతలకు బాగా తెలుసు. ఒక రిలీజ్ డేట్ అనుకొని, ఆ డేట్‌కి రిలీజ్ చెయ్యలేక వాయిదా వేయడం వల్ల అది సినిమా రిజల్ట్‌పై ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందని గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. నెలల తరబడి, సంవత్సరాల తరబడి వాయిదాలు పడుతూ వచ్చిన చాలా సినిమాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సలార్’ విషయంలో కూడా అదే జరిగే ప్రమాదం ఉందా? అనే భయం డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఉంది. అయితే ప్రశాంత్ నీల్ మీద ఉన్న అపారమైన నమ్మకం వల్ల ఈ ఆలోచన అందరిలోనూ రాకపోవచ్చు. కేవలం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ వల్లే ‘సలార్’కి విపరీతమైన హైప్ వచ్చింది. దానికి తగ్గట్టుగానే సినిమాని అత్యంత భారీగా తీశారని విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. సెప్టెంబర్ 28కి రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా డిసెంబర్ 22కి వెళ్లింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండిరగ్ ఉంది. అందువల్లే సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ చెప్పినప్పటికీ, బయట మాత్రం రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. కొన్ని సీన్స్ అనుకున్న స్థాయిలో రాకపోవడం వల్ల ఆ సీన్స్‌ను రీషూట్ చేస్తున్నారని, అందుకే సినిమాను వాయిదా వేసారనే వాదన ఒకటి వినిపిస్తుండగా, మరోపక్క ఓటీటీకి సంబంధించిన లెక్కలు ప్రాపర్‌గా తేలకపోవడంవల్లే సినిమా వాయిదా పడిరదని మరికొందరి అభిప్రాయం.
ఏది ఏమైనా వాయిదా వేసిన విధంగానే డిసెంబర్ 22న సినిమా రిలీజ్ అయితే అంతే చాలు అని అభిమానులు సరిపుచ్చుకుంటున్నారు. అయితే డిసెంబర్ 22 సినిమా రిలీజ్ అయితే ఇప్పటికే ప్రమోషన్స్‌ను చాలా హై రేంజ్‌లో స్టార్ట్ చెయ్యాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కావడం వల్ల అన్ని లాంగ్వేజెస్‌ను కవర్ చెయ్యాలి, అన్ని రాష్ట్రాల్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ చెయ్యాలి. ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ఇప్పటి నుంచే ప్రమోషన్స్ చెయాల్సి ఉంటుంది. అయితే మేకర్స్ నుంచి అలాంటి ప్రయత్నమేదీ జరుగుతున్న దాఖలాలు లేవు. మరి ఈ విషయంలో హీరో, దర్శకనిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.