English | Telugu

సీక్వెల్‌ ఆలోచనలో ‘అర్జున్‌రెడ్డి’ డైరెక్టర్‌?

విజయ్‌ దేవరకొండతో ‘అర్జున్‌రెడ్డి’ వంటి సంచలన చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సందీప్‌రెడ్డి ఈ ఒక్క సినిమాతోనే టాప్‌ డైరెక్టర్స్‌ లిస్ట్‌లో చేరిపోయాడు. ఈ సినిమాను హిందీలో ‘కబీర్‌సింగ్‌’ పేరుతో రీమేక్‌ చేసి బాలీవుడ్‌లో కూడా విజయపతాకాన్ని ఎగరేశాడు. ఇప్పుడు రణబీర్‌ కపూర్‌తో ‘యానిమల్‌’ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్‌ 1న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా నిడివి 3.30 గంటలు. ఈమధ్యకాలంలో ఏ సినిమా కూడా ఇంత డ్యురేషన్‌తో లేదు. అంత నిడివితో సినిమాను విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. అన్ని గంటలు ఆడియన్స్‌ భరించే స్థాయిలో సినిమా ఉంటుందా అనే డౌట్‌ కూడా అందరిలోనూ వస్తోంది. అయితే సినిమా మీద ఉన్న అపారమైన నమ్మకంతోనే నిడివి ఎక్కువ ఉన్నా దాన్ని ఏమాత్రం తగ్గించకుండా రిలీజ్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు సందీప్‌రెడ్డి. 

ఈ సినిమాకి సంబంధించిన మరో విశేషం ఏమిటంటే.. ‘యానిమల్‌’ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందట. ఈ సీక్వెల్‌ వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది. మొదటి పార్ట్‌లో సీక్వెల్‌కి సంబంధించిన లీడ్‌ను ఇచ్చి రెండో భాగం ఉంటుందని చెప్తారట. ఇప్పటికే ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ అనే సినిమాను చేయబోతున్నట్టు సందీప్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. తాజాగా ‘యానిమల్‌’కి సీక్వెల్‌ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. దీన్నిబట్టి చూస్తే సందీప్‌రెడ్డి డైరెక్షన్‌లో వచ్చే సినిమాలన్నీ పూర్తి కావడానికి ఎంతకాలం పడుతుందనేది ప్రశ్న.