English | Telugu

అమిత్‌ షాతో భేటీ కానున్న ఎన్టీఆర్‌.. ఎందుకో తెలుసా?

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టాలీవుడ్‌ స్టార్‌ హీరో ఎన్టీఆర్‌ మరోసారి భేటీ కాబోతున్నారు. ఇప్పుడీ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత సంవత్సరం మునుగోడు ఎన్నికల సమయంలో అమిత్‌ షా, ఎన్టీఆర్‌ భేటీ అయిన విషయం తెలిసిందే. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని నోవాటెల్‌ హోటల్‌లో దాదాపు అరగంట సేపు వీరిద్దరూ సమావేశమయ్యారు. 

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ అమిత్‌షా, ఎన్టీఆర్‌ భేటీ కానున్నారనే వార్త ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీరి భేటీ వెనుక కారణం ఏమిటి అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. వీరు ఎప్పుడు సమావేశం కానున్నారనే తెలియాల్సి ఉంది. ఈమధ్యకాలంలో పొలిటికల్‌గా ఎన్టీఆర్‌ స్పందించింది లేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ అయిన సందర్భంలోనూ ఎన్టీఆర్‌ పెదవి విప్పలేదు. మరి కేంద్ర హోం మంత్రితో ఎన్టీఆర్‌ ఎందుకు భేటీ కానున్నాడో తెలియాల్సి ఉంది.