English | Telugu

బిగ్ బాస్ కొత్త హోస్ట్ గా బాలయ్య!

బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతోంది. ఓ వైపు నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ ఎవరు అవుతారు?, టాప్-5 కి ఎవరు వెళ్తారు?, విన్నర్ ఎవరు? అనే చర్చలు జరుగుతుంటే.. మరోవైపు నెక్స్ట్ సీజన్ కి కొత్త హోస్ట్ అంటూ ప్రచారం మొదలైంది. బిగ్ బాస్-8 కి అక్కినేని నాగార్జున స్థానంలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వచ్చే అవకాశముందని న్యూస్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లకు జూనియర్ ఎన్టీఆర్, నాని హోస్ట్ లుగా వ్యవహరించగా.. మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏడో సీజన్ కి కూడా ఆయనే హోస్ట్. అయితే నెక్స్ట్ సీజన్ విషయంలో నాగార్జున షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ నుంచి హోస్ట్ గా తప్పుకోవాలని ఆయన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.

బిగ్ బాస్ నిర్వాహకులు సైతం.. గత కొన్ని సీజన్లుగా నాగార్జునే హోస్ట్ గా చేస్తుండటంతో.. ఈసారి కొత్త హోస్ట్ ని రంగంలోకి దించడం మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. 'అన్ స్టాపబుల్' షోతో సంచలనం సృష్టించిన బాలకృష్ణను బిగ్ బాస్-8 కి హోస్ట్ గా తీసుకురావడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బాలయ్య చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరితో కలిసిపోతూ.. ఎలాంటి దాపరికాలు లేకుండా మనసుకి ఏదనిపిస్తే అది మాట్లాడతాడు. అందుకే ఆయన హోస్ట్ చేసిన 'అన్ స్టాపబుల్' అంత పెద్ద హిట్ అయింది. అలాంటి బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ చేస్తే షో మరో రేంజ్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు.