ఎన్టీఆర్ 'దేవర'లో విజయ్ దేవరకొండ!
జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న సినిమా 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. వీరితో పాటు ఇతర భాషలకు చెందిన పలువులు నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఇందులో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడట.