బిగ్ సర్ ప్రైజ్.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సీక్వెల్ లోడింగ్!
టాలీవుడ్ లో ఈ జనరేషన్ లో వచ్చిన క్రేజీ మల్టీస్టారర్స్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఒకటి. వెంకటేష్, మహేష్ బాబు, అంజలి, సమంత, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 2013 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టగా, ఏళ్ళు గడిచే కొద్దీ మధ్యతరగతి యువత ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.