English | Telugu
హీరోగా సుమ తనయుడు రోషన్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన రాజమౌళి!
Updated : Oct 7, 2023
స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల చిత్రాలను రూపొందించిన రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకుడు. ‘బబుల్ గమ్’ పేరుతో రూపొందే ఈ సినిమాను రోషన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది మార్చి 15న ప్రకటించారు. పబ్‌లో డీజేగా ఉన్న రోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. లేటెస్ట్‌గా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ చేశారు.
‘బబుల్‌గమ్’ ఫస్ట్ లుక్‌ను ఎక్స్‌లో షేర్ చేసిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పందిస్తూ ‘‘నటుడిగా పరిచయం అవుతున్నందుకు నీకు అభినందనలు రోషన్. నీదైన గుర్తింపును సంపాదించుకుంటావని ఆశిస్తున్నాను. రాజీవ్, సుమగారు గర్వపడేలా చేయాలి. బబుల్‌గమ్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
ఈ సినిమాతో తెలుగమ్మాయి చెరుకూరి మానసచౌదరి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ పోస్టర్‌లో రోషన్, మానస ఇద్దరూ రెడ్ కలర్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి రొమాటిక్ లుక్‌లో ఉన్నారు. హీరోయిన్ ప్రియుడి కౌగిలిని ఆస్వాదిస్తూ ఉండగా.. హీరో మాత్రం బబుల్‌గమ్ ఊదుతూ టైటిల్‌కు న్యాయం చేశాడు. ఈ సినిమాను మహేశ్వరి మూవీస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా పి.విమల నిర్మిస్తున్నారని మొదట ప్రకటించారు. ఇప్పుడు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఈ సినిమాలో భాగస్వామి అయ్యింది. శ్రీచరణ్ పాకాల సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 10 విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.