English | Telugu
వరుణ్ ,లావణ్యలని వైరల్ చేసిన చిరంజీవి
Updated : Oct 7, 2023
తెలుగు సినీ కళామతల్లి ఒడిలో సేద తీరుతూ తమ నటనతో అశేష సినీ ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న మెగా ఫామిలీ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళికి సంబంధించిన సెలెబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి. వరుణ్,ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకోబోతున్నాడనే విషయం అందరి తెలిసిందే.తాజాగా వాళ్లిదరికి పెళ్ళికి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ సందర్భంగా ఫంక్షన్ కి సంబంధించి దిగిన ఫొటోస్ ని చిరంజీవి తన ట్విట్టర్ లో పెట్టాడు .ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
మెగా స్టార్ చిరంజీవిది మంచి మనసు అనటానికి చిరంజీవి తన భార్య బిడ్డలని ఎంతగా ప్రేమిస్తాడో అంతే ప్రేమగా తన తమ్ముళ్ల కుటుంబాన్ని, చెల్లెళ్ళ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తాడు. ఈ రోజున వాళ్ళు వాళ్ళందరూ తమకి నచ్చిన జీవితాల్లో సంతోషంగా ఉన్నారంటే అందుకు కారణం ముమ్మాటికీ మెగా స్టారే. ఆయన నట వారసుడు రామ్ చరణ్ మాత్రమే కాదు వరుణ్ తేజ్ కూడా అనే విధంగా ఆయన చాలా సార్లు చెప్పాడు. మెగాస్టార్ తన తమ్ముడు నాగబాబు కొడుకు వరుణ్ ని కూడా తన సొంత బిడ్డలాగానే భావిస్తాడు .వరుణ్ మొదటి సినిమా ముకుంద నుంచి నేటి వరకు చిరంజీవి వరుణ్ ని ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నాడు .వరుణ్ కూడా తన పెదనాన చిరంజీవి వారసత్వానికి ఎలాంటి మచ్చ రానివ్వకుండా మంచి నటుడు అనే గుర్తింపుని పొందాడు.
ఇక అసలు విషయానికి వస్తే...వరుణ్ తేజ్,లావణ్య త్రిపాఠిల మ్యారేజ్ ని పురస్కరించుకొని ప్రీ వీడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని ఇరు కుటుంబాలు స్టార్ట్ చేసాయి. అందులో భాగంగా తాజాగా జరిగిన సెబ్రేషన్స్ లో వరుణ్ లావణ్య ల తో కలిసి చిరంజీవి దిగిన పిక్ ఒక దాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు. ఆ పిక్ లో చిరంజీవి కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు.ఆ పిక్ ని చూసిన వాళ్ళందరూ చిరంజీవి కి తన కుటుంబం అంటే ఎంత అభిమానమో అని అనుకుంటున్నారు ఇంక చిరంజీవి అభిమానులు అయితే ఇది మా మెగాస్టార్ గొప్పతనం అని అంటున్నారు.చిరంజీవి పోస్ట్ చేసిన ఆ పిక్స్ సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ లు తప్ప అందరు ఉన్నారు.