English | Telugu
విజయ్ ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన కస్తూరి!
Updated : Oct 7, 2023
భారతీయుడు సినిమా లోని పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు అన్నమయ్య సినిమా లోని ఏలే ఏలే మరదలా వాలే వాలే వరసల అనే ఈ రెండు పాటలు తెలుగువారి ఇళ్లల్లో వినపడుతున్నంత కాలం కస్తూరి ని ఎవరు మర్చిపోరు. చెన్నై కి చెందిన కస్తూరి మిస్ మద్రాస్ టైటిల్ ని కూడా గెలుచుకుంది. చాలా తెలుగు సినిమాల్లో నటించి మన తెలుగు అమ్మాయే అని ప్రేక్షకులు భావించేలా నటించి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించింది. 90 వ దశకం లో తెలుగు లోను తమిళంలోను ఒక వెలుగు వెలిగిన కస్తూరి తాజాగా ఎక్స్ వేదికగా తమిళ నెంబర్ వన్ హీరో విజయ్ కి కొన్ని చురకలు అంటించడం ఇప్పుడు తమిళనాడు మొత్తాన్ని ఒక ఊపు ఊపుతుంది.
దళపతి విజయ్ కి తమిళనాడు లో ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. విజయ్ ఒక్క సైగ చేస్తే చాలు ఫాన్స్ ఏమైనా చేస్తారు. ఇంకా గట్టిగ చెప్పాలంటే విజయ్ కోసం ప్రాణాలు అయినా ఇవ్వడానికి రెడీ గా ఉన్న ఫాన్స్ ఎంతో మంది ఉన్నారు
తాజాగా ఆయన కొత్త సినిమా లియో ట్రైలర్ ని తమిళనాడులోని చాలా థియేటర్లుల్లో రిలీజ్ చేసారు. చెన్నై నగరంలోని ఒక థియేటర్ లో కూడా లియో ట్రైలర్ రిలీజ్ అయ్యింది. తమ అభిమాన హీరో ట్రైలర్ రిలీజ్ అయిన ఆనందంలో విజయ్ ఫాన్స్ థియేటర్ లోని సీట్లని కోయడం తో పాటు థియేటర్ ని కూడా చాలా వరకు ద్వంసం చేసారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.
ఇపుడు ఈ విషయం మీద కస్తూరి సూటిగా విజయ్ ఫాన్స్ తీరుని ప్రశ్నించడంతో పాటు విజయ్ కి ఒక సలహా కూడా ఇచ్చింది. ఇంతకీ తను ఏమని అందంటే..లియో ట్రైలర్ సందర్భంగా విజయ్ ఫాన్స్ ప్రవర్తించిన తీరుని ఎవరు క్షమించకూడదని పబ్లిక్ ప్రాపర్టీ ని ద్వాంసం చెయ్యడానికి మీరు ఎవరు అని ఒక విజయ్ ఫాన్ గా చాలా బాధపడుతున్నానని ఇట్స్ ఏ షేమ్ అని చాలా ఘాటుగా చెప్పింది.అలాగే నాయకుడుగా ఎదగాలని విజయ్ భావిస్తుంటే కనుక తన ఫాన్స్ ని అదుపులో పెట్టుకోవాలని విజయ్ కి సలహా ఇచ్చింది.మరి విజయ్ అండ్ విజయ్ ఫాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. కస్తూరి ప్రస్తుతం చాలా సీరీయల్స్ లో నటిస్తూ ఫుల్ బిజీ గా ఉంది.