English | Telugu
19న బాలకృష్ణతో ఎన్టీఆర్ పోటీ...ఇది నాని వంశీల పనేనా?
Updated : Oct 7, 2023
కొంత మందికి వ్యక్తులకి సంబంధించిన వార్తలని పని గట్టుకొని మరి ఎవరు సంచలనం చెయ్యాలసిన అవసరం లేదు. వాళ్ళ గురించి చిన్న విషయం బయటకి వచ్చినా అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే వార్త నిజమో అబద్దమో తెలియదు గాని నందమూరి బాలకృష్ణ,నందమూరి తారక రామారావు అలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య పోటీ నడవబోతుందని ఇద్దరి సినిమాలు ఒకే రోజు విడుదల కాబోతున్నాయనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులతో పాటు నందమూరి అభిమానులలోను ప్రకంపనలు సృష్టిస్తుంది.
నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరు కూడా పెద్దాయన తారక రామారావు నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తు తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి హవా ని కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులని క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. లేటెస్ట్ గా బాలయ్య నుంచి వస్తున్న భగవంత్ కేసరి మూవీ ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం కాబోతుంది. ఆల్రెడీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసారు. రోజుకో కొత్త న్యూస్ తో భగవంత్ కేసరి సినిమా మీద అభిమానుల్లో ,సినీ ప్రేక్షకుల్లో అంచనాలు కూడా పెరిగాయి.
ఇక తారక్ విషయానికి వస్తే..తారక్ దేవర మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అప్పుడప్పుడు సోషల్ మీడియా లో దేవర మూవీకి సంబంధించిన ఎన్టీఆర్ పిక్స్ అభిమానులని అలరిస్తూ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకొనేలా చేస్తున్నాయి.ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు మరి విడుదలకి సిద్ధంగా ఉన్న భగవంత్ కేసరి ,ఇంక షూటింగ్ కంప్లీట్ అవ్వని దేవర ల మధ్య పోటీ ఏంటి అని.
అసలు విషయంలోకి వస్తే భగవంత్ కేసరి రిలీజ్ రోజే ఎన్టీఆర్ నటించిన ఒకప్పటికి సూపర్ డూపర్ హిట్ సినిమా అదుర్స్ మూవీ మరో సారి విడుదల కాబోతుందనే వార్త ఫిలిం సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. కానీ ఇక్కడ గమనించాలసిన విషయం ఏంటంటే అదుర్స్ సినిమా అక్టోబర్ 19 న విడుదల చేస్తున్నామని ఆ సినిమా నిర్మాతలుగాని దర్శకుడు గాని ఎక్కడ ప్రకటించలేదు. ఇక నందమూరి అభిమానులు అయితే మాత్రం ఒకే రోజు తమ బాలయ్య ,ఎన్టీఆర్ సినిమాలు ఎందుకు వస్తాయి ఒకే రోజు వస్తున్నాయన్న న్యూస్ ఫేక్ న్యూస్ అని అంటున్నారు. కాగా అదుర్స్ సినిమాకి కొడాలి నాని ,వల్లభనేని వంశీ నిర్మాతలు..వీళ్లిద్దరు ప్రస్తుతం బాలకృష్ణ కి వ్యతిరేకంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే.