నాని దర్శకుడి పవర్ ఫుల్ మూవీ.. హీరో ఎవరో తెలుసా?
'బాహుబలి', 'ఎవ్వరికీ చెప్పొద్దు' సినిమాలతో ప్రేక్షకులకి చేరువైన రాకేష్ వర్రే ఎప్పుడూ ప్రయోగాత్మక పాత్రలనే ఎంచుకుంటున్నాడు. కొద్దిరోజుల క్రితం 'ఉయ్యాలా జంపాలా', 'మజ్ను' చిత్రాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా ప్రకటన వచ్చింది. 'జితేందర్ రెడ్డి' అనే పేరుతో హీరో ఎవరో తెలియకుండా పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు చూడడానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికి అందులో ఉన్న కథానాయకుడు ఎవరు?, అసలు టైటిల్ లో ఉన్న ఈ జితేందర్ రెడ్డి ఎవరు? అని చర్చనీయాంశం అయ్యింది.