English | Telugu
చిత్తూరులో నాగార్జున...వెళ్ళింది అందుకేనా ?
Updated : Oct 6, 2023
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర హీరోల్లో ఒకరు అక్కినేని నాగార్జున. అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగ్ తన కంటూ సొంత ఇమేజ్ ని అభిమానులని సంపాదించుకొని అభిమానుల గుండెల్లో యువసామ్రాట్ గా నిలిచిపోయాడు. ఇండియన్ సినీ హిస్టరీ లో నాగార్జున పోషించినన్నీ క్యారక్టర్లని ఇంకెవరు పోషించలేదు.15 సంవత్సరాల క్రితమే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అనే బిరుదుని పొందిన తొలి హీరో నాగార్జునే. ఇప్పుడు నా సామి రంగ అనే మూవీ తో ఇండస్ట్రీ రికార్డు లని బద్దలు కొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ఆయన లేటెస్ట్ గా చిత్తూర్ లో పర్యటించి తన అభిమానులని ఆనందపారవశ్యం లో ముంచెత్తాడు.
ఆంజనేయుడికి తన శక్తీ గురించి తనకి తెలియనట్లుగా నాగార్జునకి కూడా తన శక్తీ గురించి తనకి తెలియదు. నాగార్జునకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. పైగా ఆయనకీ వీరాభిమానులు కూడా చాలా ఎక్కువ. నాగార్జున హెయిర్ స్టైల్ లాగానే తమ హెయిర్ స్టైల్ ని మార్చుకొని నాగార్జున వేసిన డ్రస్ లనే వేసుకొనే అభిమానులు ఈ రోజుకి చాలా మంది ఉన్నారు. అసలు నాగార్జున స్క్రీన్ మీద కనపడితేనే చాలు మాకు పండగే అనుకునే ఫాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంక అసలు విషయంలోకి వస్తే.. ఒక నగల షాపు ఓపెనింగ్ సందర్భంగా చిత్తూరు వెళ్లిన నాగార్జునకి పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికి భారీ ర్యాలీని కూడా నిర్వహించారు.తమ అభిమాన హీరోని చూడటానికి అక్కినేని ఫాన్స్ తో పాటు సాధారణ ప్రజలు కూడా భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆ భారీ జన సందోహాన్ని చూసిన చాలా మంది నేటికీ నాగార్జున క్రేజ్ చెక్కు చెదరకుండా అలాగే ఉందని అనుకుంటున్నారు.బుల్లి తెర మీద కూడా నెంబర్ వన్ రేంజ్ లో కొనసాగుతున్న నాగ్ ని కొంత మంది అభిమానులు నాగార్జున ని ఏదైనా సినిమాలోని డైలాగ్ చెప్పమని అడిగితే సోగ్గాడి చిన్ని నాయన సినిమాలోని వాసి వాడి తస్సదియ అనే డైలాగ్ చెప్పి అభిమానుల హుషారుని రెట్టింపు చేసారు.వాటికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది.మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.