English | Telugu

చీరకట్టుతో నంద్యాల అభిమానులను లైవ్‌గా ఖుషీ చేసిన అనసూయ

అనసూయ భరద్వాజ్‌కి ప్రేక్షకుల్లో, నెటిజన్లలో ఎంత క్రేజ్‌ వుందో అందరికీ తెలిసిందే. సినిమాల్లో, టీవీలో, సోషల్‌ మీడియాలో సందడి చేసే అనసూయ ఒక్కసారిగా లైవ్‌గా కనిపిస్తే.. అప్పుడు అభిమానుల హడావిడి మామూలుగా ఉండదుగా. నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించేందుకు అనసూయ హాజరైంది. షాపింగ్‌ మాల్‌ వారు ముందుగానే ఈ విషయాన్ని ప్రచారం చేయడంతో అక్కడికి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. అనసూయ రాకకోసం ఎదురుచూశారు.

తన సొంత ఆడి కారులో నంద్యాల వెళ్ళిన అనసూయ షాపింగ్‌ మాల్‌ దగ్గరకు రాగానే ఓపెన్‌ టాప్‌ సన్‌ రూఫ్‌లో నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. అయితే ఆ సమయంలో జనం కారును చుట్టుముట్టారు. అనసూయతో హ్యాండ్‌ షేక్‌ చేసేందుకు ట్రై చేశారు. కొందరు ఫ్లవర్‌ బొకేలు అందించి స్వాగతం పలికారు. బోకేలు స్వీకరించింది కానీ, హ్యాండ్‌ షేక్‌ చేసేందుకు ఇష్టపడలేదు. ఇక షాపింగ్‌ మాల్‌లోకి వెళ్ళడానికి అనసూయ చాలా కష్టపడాల్సి వచ్చింది. అనసూయ కంటే ఆమెకు సెక్యూరిటీగా ఉన్నవారు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు.

షాపింగ్‌ మాల్‌ వద్ద ఏర్పాటు చేసిన వేదిక పైనుంచి అభిమానులకు అభివాదం చేశారు. షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. ‘మొదటిసారి నంద్యాల వచ్చాను. ఇక్కడ నాకు లభించిన స్వాగతం చూసి షాక్‌ అయ్యాను. మీ అందరి అభిమానాన్ని చూసి ఎంతో సంతోషించాను. షాపింగ్‌ మాల్‌లో చాలా రకాల చీరలు ఉన్నాయి. నేను కట్టిన చీర కూడా షాపింగ్‌ మాల్‌ వారే అందించారు. నాకు చీరలంటే చాలా ఇష్టం. నన్ను చీరలో చూడాలని మీరందరూ కోరుకుంటారు. శారీలో ఉన్న నాకు మీరంతా బిగ్‌ ఫ్యాన్స్‌ అని నాకు తెలుసు’ అని నవ్వుతూ చెప్పింది అనసూయ.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.