English | Telugu
రజనీకాంత్ మేకోవర్ లుక్.. ఇది నిజమా? గ్రాఫిక్సా?
Updated : Oct 6, 2023
సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్’తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. అంతేకాదు, తమిళ్‌లో అంతటి భారీ కలెక్షన్స్ సాధించిన ఏకైక చిత్రంగా ‘జైలర్’ రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో రజనీ 170 మూవీకి చాలా హైప్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి రోజుకో అప్‌డేట్ రిలీజ్ చేస్తుండడంతో ఈ సినిమా కోసం ఇప్పటి నుంచి అభిమానులు ఎదురుచూస్తున్నారు.
అయితే ఇప్పుడు రజనీ 170కి సంబంధించి ఒక వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షర్ట్ లేకుండా ఉన్న స్టిల్స్ చూసి రజనీ మేకోవర్ అయ్యారని కొందరు అంటుంటే, అవి నిజం ఫోటోలు కాదని కొందరు వాదిస్తున్నారు. తలైవర్ 170 వర్కింగ్ టైటిల్‌తో టి జి జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న సినిమాకి సంబంధించి ఇటీవల పూజా కార్యక్రమాలు జరిగాయి. తాజాగా కేరళలో షూటింగ్ కూడా ప్రారంభమైంది. వెంటనే ఈ ఫోటోలు విడుదలయ్యాయి అంటే అందరూ నమ్మలేకపోతున్నారు. అవి గ్రాఫిక్స్ చేశారంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. గ్రాఫిక్స్‌తో సంబంధం లేకుండా నూటికి నూరు శాతం ఇవి రజినీకాంత్ రియల్ ఫోటోలు అంటూ ఫ్యాన్స్ వారికి సమాధానం చెబుతున్నారు. జైలర్ సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వడంతో తర్వాతి సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. దానికి తగ్గట్టుగానే 170వ సినిమాను తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాలో రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషారా విజయ్ నటించనున్నారని అధికారికంగా ప్రకటించారు. జైలర్ కనిపించిన విధంగానే ఈ సినిమాలోనూ నేచురల్ లుక్‌తోనే నటించనున్నారు. రజనీకాంత్ తన వయసుకు తగిన పాత్రల్లో నటిస్తుంటేనే ఆయన సినిమాలను ప్రేక్షకులు, అభిమానులు చూస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ కొత్త లుక్‌ని రజనీకి ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అయితే షర్ట్ లేకుండా వున్న అతని స్టిల్స్ సోషల్ మీడియాలో శరవేగంగా వైరల్ అవుతున్నాయి.