బాలయ్య రికార్డుల వేట.. 'భగవంత్ కేసరి'తో మరోసారి ఊచకోత!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు. తన గత చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన హ్యాట్రిక్ పై కన్నేశారు. బాలయ్య టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న 'భగవంత్ కేసరి'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాపై నెలకొన్న అంచనాలను బట్టి చూస్తే రికార్డు ఓపెనింగ్స్ ని రాబట్టేలా ఉంది.