English | Telugu

ప్రపంచ సుందరి కల నెరవేరలేదు... 26 ఏళ్ళకే మృత్యువు ఒడిలోకి..!

మృత్యువు ఎవరిని.. ఎప్పుడు.. ఎలా కబళిస్తుందో ఎవరికీ తెలీదు. ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాన్మరణం చెందడం మనం ఈమధ్యకాలంలో తరచూ చూస్తున్నాం. అలాంటి ఘటనే ప్రపంచ సుందరి కావాలని కలలుగన్న ఆమెకు జరిగింది. ఉరుగ్వేకు చెందిన 26 ఏళ్ళ షెరికా డీఅర్మాస్26 ఏళ్ళకే మృత్యువాత పడ్డారు. ఆమె కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతోంది. అన్నిరకాల చికిత్సలు జరుగుతున్నప్పటికీ ఆమె ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్‌ 13న తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిరచాడు.

మోడల్‌గా ఎంతో పేరు తెచ్చుకున్న షెరికాకు మిస్‌ వరల్డ్‌ అవ్వాలన్నది జీవిత లక్ష్యం. దానికోసం అహర్నిశలు శ్రమించేది. తన అందాన్ని కాపాడుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేసేది. ఉరుగ్వే దేశంలో జరిగిన అందాల పోటీల్లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న షెరికా మిస్‌ వరల్డ్‌ పోటీల్లో మాత్రం నెగ్గలేకపోయింది. 2015లో చైనాలో జరిగిన మిస్‌ వరల్డ్‌ పోటీల్లో టాప్‌ 30లో నిలవలేకపోయింది. అయినా తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేది. కానీ, విధి ముందు ఆమె ఆత్మవిశ్వాసం ఓడిపోయింది. బ్యూటీ మోడల్‌ అయినా, అడ్వర్టైజింగ్‌ మోడల్‌ అయినా, క్యాట్‌వాక్‌ మోడల్‌ అయినా తాను ఎప్పుడూ మోడల్‌గా ఉండాలని కోరుకుంటున్నానని షెరాక్‌ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రపంచ సుందరి కిరీటం ధరించడమే తన కల అని చెప్పే షెరాక్‌ చివరికి మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. షెరాక్‌ అకాల మరణం ప్రపంచ వ్యాప్తంగా అందర్నీ కలచివేసింది. చిన్న వయసులోనే మృత్యువు ఒడిలోకి చేరిన ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆమె స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రార్థనలు చేశారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.