'భగవంత్ కేసరి'లో రెండో గెటప్ ఇదే.. ఆ 15 నిమిషాలు ఫ్యాన్స్ కి పండగే!
నటసింహం నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో రూపొందిన సినిమా 'భగవంత్ కేసరి'. షైన్ స్క్రీన్స్ నిర్మించిన ఈ మూవీలో శ్రీలీల, కాజల్ అగర్వాల్, అర్జున్ రామ్ పాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'భగవంత్ కేసరి'పై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను పెంచేశాయి. అయితే టీజర్, ట్రైలర్ లో చూపించని ఎన్నో సర్ ప్రైజ్ లు సినిమాలో ఉన్నాయని.. ముఖ్యంగా బాలయ్య రెండో గెటప్ అదిరిపోతుందని మూవీ టీం చెబుతోంది.