English | Telugu
బాలయ్య రికార్డుల వేట.. 'భగవంత్ కేసరి'తో మరోసారి ఊచకోత!
Updated : Oct 16, 2023
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అదిరిపోయే ఫామ్ లో ఉన్నారు. తన గత చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి'తో ఘన విజయాలను సొంతం చేసుకున్న ఆయన హ్యాట్రిక్ పై కన్నేశారు. బాలయ్య టైటిల్ రోల్ పోషించిన లేటెస్ట్ మూవీ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న 'భగవంత్ కేసరి'పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సినిమాపై నెలకొన్న అంచనాలను బట్టి చూస్తే రికార్డు ఓపెనింగ్స్ ని రాబట్టేలా ఉంది.
ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా బాలయ్య సినిమా సినిమాకి సంచలనాలు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన 'అఖండ' సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రూ.15 కోట్లకు పైగా షేర్ రాబట్టగా, వరల్డ్ వైడ్ గా రూ.18 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఆ సమయానికి అది బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్. ఆ తర్వాత వచ్చిన 'వీరసింహారెడ్డి' మొదటిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.25 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు 'భగవంత్ కేసరి' అంతకుమించిన సంచలనాలు సృష్టించేలా ఉంది.
'వీరసింహారెడ్డి' ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఆ సమయంలో ఇతర బడా సినిమాల నుంచి తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ పరంగా రికార్డులు సృష్టించింది. ఇప్పుడు దసరాకి వస్తున్న 'భగవంత్ కేసరి'కి కూడా 'టైగర్ నాగేశ్వరరావు', 'లియో' చిత్రాల నుండి పోటీ ఉండనుంది. అయితే ఈ దసరా సినిమాలలో తెలుగునాట 'భగవంత్ కేసరి'పైనే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బాలయ్య, అనిల్ రావిపూడి ఇద్దరూ ట్రాక్ మార్చి వైవిధ్యమైన సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మెచ్చే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ని కట్టిపడేసే ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయని.. పండగకి అసలుసిసలు సినిమా ఇదేనని అంటున్నారు. ఇప్పటికే ఓపెన్ అయిన ఓవర్సీస్ బుకింగ్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఫస్ట్ డే కలెక్షన్స్, ఫుల్ రన్ కలెక్షన్స్ పరంగా 'భగవంత్ కేసరి'తో 'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాలను మించిన సంచలనాలు బాలయ్య సృష్టించబోతున్నారని అర్థమవుతోంది.