'మార్టిన్ లూథర్ కింగ్' ట్రైలర్.. సంపూ సాలిడ్ హిట్ కొట్టేలా ఉన్నాడు!
సంపూర్ణేష్ బాబు టైటిల్ రోల్ పోషించిన తాజా చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్'. వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో మహాయాన మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పూజ కొల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో వి.కె. నరేష్, వెంకటేష్ మహా ముఖ్యపాత్రలు పోషించారు. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రాలతో దర్శకుడిగా ఆకట్టుకున్న వెంకటేష్ మహా.. ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం.