English | Telugu
నా భర్త కి చాలా మందితో ఎఫైర్స్..ప్రముఖ నటి వెల్లడి
Updated : Oct 16, 2023
ఆమె ఒక సుప్రసిద్ధ నటి...1980 వ దశకంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం కూడా సినిమాలు,టీవీ షో లు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. ఆమె భర్త ఆమెని మించిన గొప్ప నటుడు.పైగా భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటుడు. ఇప్పుడు ఆమెగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నటుడు ,భర్త అయినటువంటి అతని గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నా భర్తకి ఎంతో మంది తో సంబంధాలు ఉన్నాయని అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు పెను సంచలనమే సృష్టిస్తున్నాయి.
రత్న పాఠక్ ,రత్న పాఠక్ షా గా మారక ముందు హిందీ చిత్ర సీమలో మంచి పేరున్న నటి. ఆమె 1983 వ సంవత్సరం లో వచ్చిన మండి,మిర్చి మసాలా అనే సినిమాల్లో నటించింది. పిదప కొన్నేళ్ల గ్యాప్ తర్వాత అంటే 2002 నుంచి నేటి వరకు ఎన్నో సినిమాలతో పాటు పాపులర్ టీవీ షోస్ లో కూడా నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులని అలరిస్తూ ఉంది. రత్న పాఠక్ భర్త ఎవరో కాదు ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా.అందుకే ఆమె రత్న పాఠక్ షా గా మారింది. భారతీయ చలన చిత్ర చరిత్రలో నసీరుద్దీన్ షా చాలా పెద్ద నటుడు. ఆయన నటనకి అభిమానులు కూడా చాలా ఎక్కువ. తాజాగా రత్న పాఠక్ షా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తన భర్త నసీరుద్దీన్ షా గురించి అలాగే తన గురించి గతంలో జరిగిన కొన్ని విషయాలని చెప్పింది.
రత్న పాఠక్ అండ్ నసీరుద్దీన్ షా లు కలిసి గతంలో ఒక సినిమాలో నటించారు. అప్పుడు తొలి చూపులోనే రత్న పాఠక్ నసీరుద్దీన్ ని ఇష్ట పడింది. అప్పటికే నసీరుద్దీన్ కి పెళ్లి అయ్యింది..అవ్వడమే కాదు విడాకులు కూడా తీసుకున్నాడు. పైగా ఆ బాధతో డ్రగ్స్ కి కూడా నసీరుద్దీన్ బానిస అయ్యాడు.ఇవన్నీ తెలిసి కూడా రత్న పాఠక్ నసీరుద్దీన్ తో ప్రేమలో పడింది.. పీకల్లోతు ప్రేమలో పడివుండటం వలన రత్న పాఠక్ షా ని మర్చిపోలేక పోయింది.పైగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నసీరుద్దీన్ కి చాలా మంది అమ్మాయిలతో బ్రేక్ అప్ అయ్యింది. ఈ విషయాలన్నీ కూడా రత్న పాఠక్ కి తెలుసు. కానీ నసీరుద్దీన్ లేకుండా తన జీవితం లేదని రత్న పాఠక్ భావించి తన ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి పెళ్లి చేసుకుంది.పెళ్లి అయిన తర్వాత నసీరుద్దీన్ ,రత్న పాఠక్ ని తప్ప మరెవర్నీ ఇష్టపడలేదు.. పైగా నసీరుద్దీన్ మనసులో కూడా రత్న పాఠక్ తప్ప మరెవరు లేరు.తనే లాస్ట్ అంట.. ఈ విషయాలన్నీ స్వయంగా రత్న పాఠక్కే వివరంగా చెప్పింది. ఇద్దరకీ ఇమాద్ షా,వివాన్ షా అనే ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు.