English | Telugu
'పుష్ప-2'కి బ్రేక్ ఇచ్చి ఢిల్లీ వెళ్ళిన బన్నీ.. ఎందుకో తెలుసా?
Updated : Oct 16, 2023
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా రేంజ్ లో ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఇప్పుడు వీరి కలయికలో పుష్ప రెండో భాగంగా 'పుష్ప: ది రూల్' తెరకెక్కుతోంది. దీనిపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కి బన్నీ చిన్న బ్రేక్ ఇచ్చాడు. బన్నీ షూటింగ్ కి బ్రేక్ ఇవ్వడానికి కారణం 'పుష్ప-1' కావడం విశేషం.
'పుష్ప-1'లో పుష్పరాజ్ గా బన్నీ నటనకు అందరూ ఫిదా అయ్యారు. అంతేకాదు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం రేపు(అక్టోబర్ 17న) ఢిల్లీలో జరగనుంది. ఈ వేడుక కోసమే తాజాగా బన్నీ తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్ళారు. బన్నీ ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్ లో తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జాతీయ ఉత్తమ నటుడిగా రేపు అవార్డు అందుకోనున్న బన్నీ.. తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి మళ్ళీ పుష్ప-2 షూటింగ్ తో బిజీ కానున్నారు.