English | Telugu
CM పెళ్ళాం ఓపెనింగ్!
Updated : Oct 16, 2023
వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బేనర్ పై బొల్లా రామకృష్ణ నిర్మాతగా రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'CM పెళ్ళాం'(కామన్ మ్యాన్ పెళ్ళాం). ఈ సినిమా సోమవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుంది.
ఈ సినిమాలో సీఎంగా అజయ్, సీఎం పెళ్లాంగా ఇంద్రజ, హోమ్ మినిస్టర్ గా సురేష్ కొండేటి నటిస్తున్నారు. సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా రమణారెడ్డి అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రిన్స్ హనీ, డీఓపీగా నాగ శ్రీనివాసరావు, ఎడిటర్ గా రామారావు, ఆర్ట్ డైరెక్టర్ గా రామకృష్ణ వ్యవహరిస్తున్నారు.
ఈ సందర్భంగా సినిమా సమర్పకుడు వాకాడ అప్పారావు మాట్లాడుతూ.. "కామన్ గా చాలా మంది అనుకుంటారు సీఎంకి కామన్ మ్యాన్ కి ఏమీ తేడా లేదు, ఇద్దరూ ఒకటేనని అందుకు సంబంధించిన ఒక భార్య కథే ఈ సినిమా. ఇది ఒక కొత్త సబ్జెక్ట్, ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేని ఒక సబ్జెక్ట్. సమాజానికి పొలిటీషియన్స్, సాధారణ ప్రజలు ఎలా ఉపయోగపడాలి అని ఉద్దేశంతో రాసుకున్న సినిమా ఇది. ఎక్కడా నెగిటివ్ లేకుండా ముందుకు వెళుతోంది. అందరూ సినిమా చూసి ఆదరించాలి" అన్నారు.
డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ.. "ఇది వెరైటీ సినిమా అని చూసాక ప్రేక్షకులే చెబుతారు. డిఫరెంట్ యాంగిల్ లో పొలిటికల్ పాయింట్స్, నిజంగా ఒక పదేళ్ళ తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనేది భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం." అన్నారు.
నిర్మాత బొల్లా రామకృష్ణ మాట్లాడుతూ.. "రమణారెడ్డి గారు నా వద్దకు వచ్చి ఈ స్టోరీ చెప్పగానే సినిమా చేయాలనుకున్నాం. పొలిటికల్ గా కానీ కామన్ మ్యాన్ కి గాని జరిగే ఇబ్బందులు చూపించాలనే ఉద్దేశంతో నిర్మాణంలో అడుగుపెడుతున్నాం." అన్నారు.
నటి ఇంద్రజ మాట్లాడుతూ.. "ఈరోజు సీఎం పెళ్లాం - కామన్ మ్యాన్ పెళ్ళాం అనే సినిమా ఓపెనింగ్ జరిగింది. సొసైటీకి చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజెస్ ఉన్న ఒక మూవీ ఇది. సోల్ ఫుల్ గా తీయాలని ప్రయత్నిస్తాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం" అని అన్నారు.