English | Telugu
ఊర్వశీ రౌతెలాకు శాపంగా మారిన ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్!
Updated : Oct 16, 2023
వరల్డ్ కప్ క్రికెట్‌లో భారత, పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజ్ మామూలుగా వుండదు. ఇండియా టీమ్‌తో సహా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకునే ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. అందరూ ఆనందోత్సాహంతో పండగ చేసుకున్నారు. అయితే, హీరోయిన్ ఊర్వశీ రౌతేలా విషయంలో మాత్రం ఆ మ్యాచ్ ఒక శాపంలా పరిణమించింది. ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న మ్యాచ్‌ను వీక్షించడంలో నిమగ్నమైపోయిన ఊర్వశి ఎంతో ఖరీదైన తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది.
ఈ విషయాన్ని ఇన్‌స్టా గ్రామ్ ద్వారా తెలియజేసింది. తాను పోగొట్టుకున్న మొబైల్ ఎంతో ఖరీదైందని, అది 24 క్యారెట్ల బంగారం తాపడం చేసిన ఫోన్ అని వివరించిందది. తన మొబైల్ ఎవరికైనా దొరికితే తిరిగి ఇవ్వాలని కోరుతోంది. ఈ పోస్టుకు పోలీసులు, స్టేడియం అధికారిక ఎక్స్ ఖాతాలను ట్యాగ్ చేశారు. ఆమె పోస్టును చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్న పని అని కొందరు అంటుంటే, ఫోన్ ఎవరికైతే దొరికిందో అతను అదృష్టవంతుడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. బంగారంతో కూడిన అంత ఖరీదైన ఫోన్ ఎవరికైనా దొరికితే తిరిగి ఇస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. కొన్ని తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఊర్వశి రౌతేలా.. వాల్తేరు వీరయ్య, స్కంద చిత్రాల్లో తన అందాలతో అందర్నీ అలరించింది.