English | Telugu
శ్రీలీలతో రిలేషన్ గురించి చెప్పిన అనిల్ రావిపూడి!
Updated : Oct 16, 2023
హీరోయిన్‌గా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న శ్రీలీల నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘భగవంత్ కేసరి’ అక్టోబర్ 19న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణకు కూతురుగా నటించిన శ్రీలీల ఎమోషనల్ సీన్స్‌లో సైతం తన పెర్‌ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేయబోతోందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీలీలతో తనకు ఉన్న బంధుత్వం గురించి వెల్లడిరచారు. ‘శ్రీలీల తల్లి డాక్టర్ స్వర్ణ సొంత ఊరు ఒంగోలు దగ్గరలోని పంగులూరు. మా అమ్మమ్మది కూడా అదే ఊరు. డాక్టర్ స్వర్ణ నాకు అక్క వరస అవుతుంది. శ్రీలీల తెలుగు గడ్డపైనే పుట్టింది. చదువుకుంది మాత్రం బెంగుళూరు, అమెరికాలలో. శ్రీలీల ప్రతి సంవత్సరం పంగులూరుకు వస్తూ ఉంటుంది’ అని ఆమెతో తనకు ఉన్న బంధుత్వం గురించి వివరించారు అనిల్ రావిపూడి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. ‘భగవంత్ కేసరి’ సెట్‌లో అందరి ముందు ‘డైరెక్టర్‌గారూ!’ అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం ‘మావయ్యా!’ అని పిలుస్తుందట.