English | Telugu

అంబానీ నిర్మాతగా తెరకెక్కిన సంపూర్ణేష్ బాబు సినిమా హిట్ టాక్  

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరో గా నటించిన తాజా చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. అక్టోబర్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ మూవీ విడుదలకి ముందే సంచలనాన్ని క్రియేట్ చేసింది. సంపూర్ణేష్ బాబు నట జీవితంలోనే మార్టిన్ లూథర్ కింగ్ మూవీ ఒక పెను సంచలనాన్ని సృష్టించింది.

సంపూర్ణేష్ బాబు ఇప్పటివరకు నటించిన సినిమాలన్ని ఒక ఎత్తయితే ఇప్పుడు తాజాగా ఆయన నుంచి వస్తున్న మార్టిన్ లూథరన్ కింగ్ సినిమా ఒక ఎత్తు. 1960 వ దశకంలో అమెరికాకి చెందినమార్టిన్ లూథరన్ కింగ్ అనే నల్ల జాతీయుడు పేరుతో ఈ సినిమా వస్తుండటం తో అందరిలోనూ సినిమా మీద ఆమాంతం అంచనాలు పెరిగాయి. మార్టిన్ అమెరికా దేశపు మంత్రే కాకుండా ఐ హావ్ ఏ డ్రీం అనే స్పీచ్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు గడించాడు. మరి ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్న ఈ మూవీ లో సంపూర్ణేష్ బాబు స్పీచ్ అండ్ ఆయన ఈ సినిమా లో ఏమి చెప్తున్నాడో,ఎలా చెప్తున్నాడో చూడాలి

ఇక అసలు విషయానికి వస్తే మార్టిన్ లూధర్ కింగ్ సినిమా మీద యూనిట్ కి ఉన్న నమ్మకంతో కర్నూలు, నెల్లూరు విజయవాడ,వైజాగ్ లాంటి నగరాలలో సినిమా రిలీజ్ కంటే ముందే ప్రీమియర్ షో లు వేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా సూపర్ గా ఉందని అంటున్నారు. అలాగే రీసెంట్ గా వరంగల్ లో కూడా మార్టిన్ లూథర్ కింగ్ ప్రీమియర్ షో వెయ్యడం జరిగింది. అక్కడ కూడా చూసిన ప్రతి ఒక్కరు సినిమా అదిరిపోయిందని,సంపూర్ణేష్ బాబు యాక్టింగ్ చాలా బాగుందని అలాగే కొత్తగా కూడా ఉందని అంటున్నారు. వై నాట్ స్టూడియో, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ ,వెంకటేష్ మహా హోమ్ బ్యానేర్ మరియు మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అపర్ణ కొల్లూరు దర్శకురాలిగా పరిచయమవుతుంది. ఓటు హక్కు కి ఉన్న విలువ గురించి సినిమాలో చాలా చక్కగా చెప్పారని ప్రీమియర్ షో స్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. అలాగే టీజర్ లో కూడా సంపూర్ణేష్ బాబు కి చెందిన ఓటు కోసం నరేష్ అండ్ ఇంకొకరు ఎంత ఆత్రపడుతున్నారో తెలుస్తుంది.దీన్ని బట్టి మార్టిన్ లూథర్ కింగ్ మూవీ కంప్లీటుగా పొలిటికల్ మూవీ అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేస్తుంది.కాగా ఈ మార్టిన్ లూధర్ కింగ్ సినిమా తమిళంలో యోగి బాబు హీరోగా 2021 వ సంవత్సరం లో నెట్ ఫ్లిక్స్ లోవిడుదలయ్యి ఘన విజయం సాధించిన నెల్సన్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.